సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన ప్రభుత్వ పథకం.. రిటైర్మెంట్ తర్వాత (SCSS Scheme) చాలా మంది వృద్ధులు తమ ఆదాయాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ల (FD)లో పెట్టుబడి పెడుతుంటారు. మరికొంతమంది దాచుకున్న మొత్తాన్ని ఏదైనా బ్యాంకు ఖాతాల్లో ఉంచుతారు.
కనీస పెట్టుబడి పరిమితి రూ. 1000. ఈ పథకంలో రూ. 30 లక్షలు డిపాజిట్ చేస్తే.. 8.2శాతం చొప్పున వడ్డీగా రూ. 12,30,000 సంపాదించవచ్చు. ప్రతి త్రైమాసికంలో రూ. 61,500 వడ్డీని పొందొచ్చు.
5 ఏళ్ల తర్వాత రూ. 30 లక్షలు మెచ్యూరిటీతో రూ. 42,30,000 అవుతుంది. రూ. 30 లక్షలు డిపాజిట్ వద్దంటే.. 5 ఏళ్ల పాటు రూ. 15 లక్షలు డిపాజిట్ చేయండి. భారీ మొత్తంలో వడ్డీ వస్తుంది.
రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే.. 8.2 శాతం రేటుతో 5 ఏళ్లలో రూ. 6,15,000 వడ్డీ మాత్రమే వస్తుంది. అయితే, ఈ వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తే.. రూ.30,750 అవుతుంది. రూ. 15లక్షలతో మొత్తంగా రూ.6,15,000 వడ్డీ మొత్తాన్ని కలిపితే మొత్తంగా రూ. 21,15,000 మెచ్యూరిటీగా అందుతుంది.
స్కీమ్ పొడిగింపు ఇలా :
SCSS స్కీమ్ 5 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత కూడా ఈ స్కీమ్ బెనిఫిట్స్ కావాలంటే డిపాజిట్ మొత్తం మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ వ్యవధిని 3 ఏళ్లు పొడిగించవచ్చు.
మెచ్యూరిటీ నుంచి ఒక ఏడాది లోపు పొడిగించవచ్చు. ఇలా పొడిగించిన అకౌంట్లు మెచ్యూరిటీ తేదీ నుంచి వడ్డీని పొందుతాయి. సీనియర్ సిటిజన్లు SCSS సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు.
ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? :
60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పెట్టుబడి పెట్టవచ్చు. VRS తీసుకునే పౌర రంగ ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ నుంచి రిటైర్మెంట్ పొందిన వారు షరతులతో వయోపరిమితిలో సడలింపు పొందవచ్చు.