ఆయుష్మాన్ హెల్త్ కార్డు.. 70ఏళ్లు పైబడితే అప్లయ్ చేయొచ్చు..

రూ. 5 లక్షల వరకు ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్..!

70ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కింద హెల్త్ కార్డులను అందిస్తోంది. ఆరోగ్య బీమా ద్వారా సీనియర్ సిటిజన్లు ఏడాదికి రూ. 5 లక్షల విలువైన ఫ్రీ మెడికల్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)లో భాగంగా ఆయుష్మాన్ వే వందన కార్డును పొందవచ్చు. ఈ ఆయుష్మాన్ యాప్ ద్వారా నేరుగా అప్లయ్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ వే వందన కార్డ్ ఏంటి? :
ఆయుష్మాన్ వే ​​వందన కార్డ్ అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రత్యేక ఆరోగ్య గుర్తింపు కార్డు. దేశమంతటా ఎంప్యానెల్డ్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సంవత్సరానికి ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.

2018లో పీఎం నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 55 కోట్లకు పైగా ప్రజలలో దాదాపు 40 శాతం కవర్ చేస్తుంది. అక్టోబర్ 29, 2024 నుంచి ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరూ ఈ పథకానికి అర్హులే.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? :
ఏ భారతీయ పౌరుడైనా
70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉంటే
వ్యాలీడ్ ఆధార్ కార్డు ఉండాలి

అవసరమైన డ్యాకుమెంట్లు ఇవే :
ఆధార్ కార్డు (వయస్సు, ఐడెంటిటీ ప్రూఫ్)
ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్

ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
మీరు రెండు సులభమైన మార్గాల ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మొబైల్ యాప్ ద్వారా రెండోది అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు