భారీ లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు..ఇవే టాప్ 5 ప్రాఫిట్ స్టాక్స్..

వారంలో మొదటి ట్రేడింగ్ సెషన్ అయిన సోమవారం (మే 26న) భారత స్టాక్ మార్కెట్లు (Stock Market Updates) బలంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూచీలు మొత్తం గ్రీన్‎లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉదయం 10.10 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 678 పాయింట్లకు పైగా పెరిగి 82,405.95 స్థాయికి చేరుకోగా, నిఫ్టీ 50 కూడా 202 పాయింట్లు లాభపడి 25,055కి చేరుకుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 354 పాయింట్లు వృద్ధి చెందగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 414 పాయింట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్ కొన్ని నిమిషాల వ్యవధిలోనే భారీ లాభాల దిశగా దూసుకెళ్లగా, ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.

టాప్ 5 స్టాక్స్

ఇదే సమయంలో హిందాల్కో, టాటా మోటార్స్, M&M, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, ఎటర్నల్, భారత్ ఎలెక్ట్రిక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, ట్రెంట్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉన్నాయి. ఇండెక్స్‌లో అధిక ప్రాధాన్యత కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పెరగడంతో మార్కెట్ ఊపందుకుంది. అలాగే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతులపై 50% సుంకాన్ని జూలై 9 వరకు వాయిదా వేశారు. ఇది మార్కెట్ సెంటిమెంట్లపై సానుకూల ప్రభావాన్ని చూపిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్ అన్నిరంగాల్లో కూడా..

ఈ క్రమంలో మార్కెట్‌లోని అన్ని రంగాలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా, మెటల్, ఆటో రంగాలలో అతిపెద్ద పెరుగుదల కనిపిస్తోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో ఇది 1% పెరిగింది. అదే సమయంలో నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.68 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.68 శాతం లాభాలను దక్కించుకున్నాయి. శుక్రవారం ప్రారంభంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ 50, సెన్సెక్స్ ఫ్లాట్ స్థాయిలో ప్రారంభమైన తర్వాత దాదాపు 1% లాభపడ్డాయి. యూరోపియన్ యూనియన్ నుంచి దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించేందుకు గడువును జూలై 9 వరకు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత సోమవారం ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. ఇది పెట్టుబడిదారుల ఆందోళనలను చాలా వరకు తగ్గించిందని చెప్పుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు