నాలుగు రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి అవకాశమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయంగా గిరాకీ తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూలతల నేపథ్యంలో బంగారం ధరలు దిగివస్తున్నట్లు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల అమలుకు అమెరికా ఫెడరల్ కోర్ట్ బ్రేకులు వేసింది. ఈ ప్రభావం బంగారం ధరలపై ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ తీర్పు తర్వాత గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో మే 30, 2025 రోజున బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో భరీగా తగ్గిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా దిగివస్తున్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర నాలుగు రోజుల్లోనే 10 గ్రాములపై రూ.1400 మేర పడిపోయింది. ఇవాళ రూ.440 తగ్గడంతో తులం ధర రూ. 97,040 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు నాలుగు రోజుల్లో రూ.950 మేర తగ్గింది. ఇవాళ రూ.400 దిగిరావడంతో తులం రేటు రూ. 88 వేల 950 వద్దకు దిగివచ్చింది.
స్వల్పంగా తగ్గిన వెండి
బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిసింది. అయితే, పసిడితో పోలిస్తే చాలా తక్కువ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు స్వల్పంగా తగ్గింది. ఇవాళ కిలో వెండి రేటు రూ.100 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.1,10,900 వద్ద ట్రేడవుతోంది.