స్టాక్ మార్కెట్ గురించి సరిగ్గా తెలుసుకుని, దీర్ఘ కాలంలో మంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మాత్రం భారీ లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీల షేర్స్ కొనుగోలు చేసి కనీసం ఐదేళ్లు లేదా పదేళ్ల వరకు చూస్తే మాత్రం, మీరు చేసిన పెట్టుబడి కంటే రెట్టింపు మొత్తాలను పొందవచ్చని అంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాగే జరిగింది. కానీ ఇది ఓ చిన్న కంపెనీ స్టాక్ విషయంలో జరగడం విశేషం. ఎందుకంటే చిన్న కంపెనీల స్టాక్ ఎంపిక చేసుకుని పెట్టుబడులు చేయడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.
అలాంటి కంపెనీలను ఎంచుకుని భారీ లాభాలను అందించిన వాటిలో ఇప్పుడు రతి స్టీల్ కూడా చేరింది. ఎందుకంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారులకు ఇది గత ఐదు సంవత్సరాలలో దాదాపు 650% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ క్రమంలో ఈ స్టాక్ అనేక మంది చిన్న పెట్టుబడిదారుల కలలను నిజం చేసింది. ఈ మధ్య కాలంలో ఈ స్టాక్ పనితీరులో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈ నేపథ్యంలో స్మాల్ క్యాప్ స్టాక్ రతి స్టీల్ షేర్లు సోమవారం 7% కంటే ఎక్కువ పెరిగి రూ.30కి చేరుకున్నాయి.
4 లక్షల రూపాయలు
ఈ కంపెనీ స్టాక్ ఏడేళ్ల క్రితం అంటే 2018లో రూ.2గా ఉంది. ఆ సమయంలో ఈ కంపెనీ స్టాక్స్ రెండు లక్షలు కొనుగోలు చేసి, ఇప్పటి వరకు ఉంచిన వారికి మంచి లాభాలు వచ్చాయని చెప్పవచ్చు. అంటే అప్పుడు 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు మాత్రం రూ.56 లక్షలు వచ్చాయని చెప్పవచ్చు. అంటే కేవలం ఏడేళ్లలోనే 15 రెట్ల లాభం వచ్చింది. కనీసం ఐదేళ్లపాటు ఈ కంపెనీలో పెట్టుబడులు ఉంచిన వారికి సైతం మంచి రాబడులు వచ్చాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లో చిన్న కంపెనీల స్టాక్స్ మరోసారి సత్తా ఏంటో నిరూపించాయి.