పోస్టాఫీసులో ఇలా ఇన్వెస్ట్ చేయండి.. 115 నెలల్లో ఎంత వస్తుందంటే?

మీరు సంపాదించిన డబ్బులో పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సేవింగ్ చేసుకోవచ్చు. తద్వారా భవిష్యత్తులో లక్షల రూపాయలను కూడబెట్టుకోవచ్చు.

ఇతర పెట్టబడుల్లో కన్నా పోస్టాఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తోంది. అందులో కిసాన్ వికాస్ పత్ర యోజన పథకం (kisan vikas patra) ఒకటి. ఇందులో పెట్టుబడి పెట్టడం ద్వారా 115 నెలల్లో భారీగా వడ్డీని పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పూర్తిగా సురక్షితం. పెట్టుబడి ద్వారా ఎలాంటి మార్కెట్ నష్టాలను ఉండవు.

పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో పెట్టుబడి ద్వారా భారీ వడ్డీ రేట్లను పొందవచ్చు. పెట్టుబడిదారులు 7.5 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. 10 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరు మీద కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

ఈ పథకంలో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే గరిష్ట పెట్టుబడి పరిమితి అంటూ లేదు. ఎంత మొత్తం పెట్టుబడి పెట్టినా అది 115 నెలల తర్వాత రెట్టింపు అవుతుంది.

ఈ పథకంలో రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే.. ప్రస్తుత వడ్డీ రేటు 7.5 శాతంతో మొత్తంగా 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీ మొత్తం నగదు రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెరుగుతుంది. అంటే.. రెట్టింపుగా రూ. 4 లక్షల వరకు  వడ్డీ వస్తుంది.

ఇందులో వడ్డీ రేటును కాంపౌండింగ్ ఆధారంగా లెక్కిస్తారు. పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకంలో అకౌంట్ సింగిల్ లేదా జాయింట్ ఓపెన్ చేయొచ్చు.

మీరు ఆన్‌లైన్ kisan vikas patra (KVP) కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇందులో మెచ్యూరిటీపై ఎంత మొత్తంలో రాబడి వస్తుందో తెలుసుకోవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు