రూ.8,300 షేర్ ధర ఒక్కరోజే 33 శాతం తగ్గుదల.. ఇన్వెస్టర్లకు షాకింగ్..

స్టాక్ మార్కెట్లో శిల్చర్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు (Silchar Technologies stocks) ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే ఈ సంస్థ షేర్లు ఒక్కరోజులోనే 33 శాతం పడిపోయాయి. ఈ క్రమంలో రూ.8,300 నుంచి రూ.6007.75కు చేరాయి. అయితే తాజాగా ఈ కంపెనీ 27,46,52,718 బోనస్ షేర్లను జారీ చేయాలని ప్రకటించింది. ఈ బోనస్ షేర్ల ఫేస్ విలువ రూ.2గా ప్రకటించింది. జూన్ 9, 2025ను ఈ బోనస్ షేర్ల చెల్లింపు తేదీగా నిర్దేశించారు. జూన్ 10, 2025న ఈ షేర్ల ట్రేడింగ్ ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది.

ప్రధాన కారణం ఇదేనా..

ఈ బోనస్ షేర్ల జారీకి అర్హత పొందడానికి రికార్డ్ తేదీ (May 23, 2025) నాటికి షేర్లను కలిగి ఉండాలి. రికార్డ్ తేదీ తరువాత షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఈ బోనస్ షేర్లను పొందలేరు. బోనస్ షేర్ల 1:2 రేషియో పంపిణీ అనంతరం శిల్చర్ టెక్నాలజీస్ షేర్లు ధర రూ.5,870 వద్ద ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఈ కంపెనీలో షేర్లను కొనుగోలు చేసిన అనేకమంది ఇన్వెస్టర్లు ఒక్కసారిగా అమ్మకాల వైపు మొగ్గుచూపిన కారణంగా షేర్ ధర పడిపోయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఐదేళ్లలో పెరుగుదల

గత ఐదు సంవత్సరాలలో, శిల్చర్ టెక్నాలజీస్ షేర్లు రూ.25 నుంచి రూ.8,300 వరకు పెరగడం విశేషం. ఇది దాదాపు 33,000% పెరుగుదల. ఈ క్రమంలో షేరు ధర భారీ స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ, తాజాగా తగ్గుదలకు వచ్చింది. ఈ షేర్లలో మళ్లీ గెయిన్ జరగవచ్చని పలువురు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. శిల్చర్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ప్రస్తుతం రూ.6,700 కోట్లను దాటింది. ఈ భారీ వ్యాపార ప్రగతి కంపెనీని మార్కెట్‌లో ఒక శక్తివంతమైన ప్లేయర్‌గా నిలిపింది. గరిష్ట పెరుగుదల చూస్తున్నప్పటికీ, తాజాగా 33% తగ్గుదలను సూచిస్తుంది.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు