షాకిచ్చిన వెండి.. ఒక్కరోజే రూ.3 వేలు పెరుగుదల

దేశంలో వెండి ధరలు, బంగారం రేట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకు వీటి ధరలు (Silver Rate Today) పైపైకి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 6, 2025న సిల్వర్ రేట్లు రూ.3 వేలు పెరిగి ఆల్ టైం గరిష్టానికి (రూ.1,07,000) చేరుకున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్‎లో వెండి ధరలు ఏకంగా రూ.4 వేలు పెరిగి కిలోకు రూ.1,18,000కు చేరుకున్నాయి. దీనికి ముందు రోజైన గురువారం రూ.2 వేలు పెరగడం విశేషం.

కారణాలివేనా..

వాణిజ్య రంగంలో గందరగోళం, గ్లోబల్ ఆర్థిక స్థితిపై అనిశ్చితి, అంతర్జాతీయంగా బంగారం ధరలలో మార్పులు ఇవన్నీ సిల్వర్ధ రల పెరుగుదలకు ముఖ్య కారణాలని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో దేశీయ మార్కెట్‌లో కూడా వీటి ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ వృద్ధి మార్కెట్‌లోని కొత్త పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలను, అలాగే వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావాన్ని చూపించింది. ప్రస్తుతం ఈ కారణంగా ఒకేసారి వెండిని కొనుగోలు చేసే కస్టమర్ల సంఖ్య తగ్గిపోనుందని వ్యాపారులు చెబుతున్నారు.

రాజధానిలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వెండి ధరలు పుంజుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జ్యువెలరీ సహా ఇతర ఉత్పత్తుల విక్రయాలు కొంత మధ్య స్థాయిలో ఉన్నప్పటికీ, వెండి కొనుగోళ్లు మాత్రం అంచనాలకు మించి పోయాయని వ్యాపారులు అంటున్నారు. హైదరాబాద్‎లో వెండి ధరల పెరుగుదల వాణిజ్య కార్యకలాపాలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది. ధరల పెరుగుదల వల్ల, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు తమ ఆర్ధిక స్థితిని పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు భవిష్యత్తులో వీటి ధరలు తగ్గుతాయని పలువురు అంటుండగా, మరికొంత మంది మాత్రం ఇంకా పెరుగుతాయని చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు