5 ఏళ్లలో రూ.4 లక్షల రాబడి.. పోస్టాఫీసులో ఈ స్కీముల గురించి తెలుసుకోవాల్సిందే..

అత్యంత ప్రజాదరణ పొందిన పోస్టాఫీసులోని రెండు పథకాల గురించి తెలుసుకుందాం. పోస్టాఫీసు (Post Office Schemes) అందించే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) పథకాలు పొదుపు చేసేందుకు మంచి మార్గాలని చెప్పొచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా ఐదేళ్లలో రాబడి కోరుకునే వారికి ఈ పథకాలు బెస్ట్ ఛాయిస్.

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

ఈ స్కీమ్ 8.2% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే VRS తీసుకునే పౌర రంగ ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ శాఖ నుంచి రిటైర్మెంట్ పొందిన వారు షరతులతో వయోపరిమితిలో సడలింపు పొందవచ్చు. అయితే ఈ పథకంలో రూ.10 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే.. ఐదేళ్ల తర్వాత రూ.14,10,000లు తీసుకోవచ్చు. ఇందులో కనీసం రూ.1000, గరిష్టంగా రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అదేవిధంగా ఈ పథకంలో రూ. 30 లక్షలు డిపాజిట్ చేస్తే.. 8.2శాతం చొప్పున వడ్డీగా రూ. 12,30,000 సంపాదించవచ్చు. ప్రతి త్రైమాసికంలో రూ. 61,500 వడ్డీని పొందొచ్చు. ఉద్యోగ విరమణ చేసి పెట్టుబడి పెట్టడానికి సురక్షితమైన పథకం కోసం వెతుకుతుంటే.. ఈ స్కీమ్ ఉత్తమ ఎంపిక అని చెప్పొచ్చు .

 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7% వార్షిక వడ్డీని అందిస్తుంది. ఇందులో కనీస డిపాజిట్ రూ.1000 ఉండగా, గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో కూడా పన్ను ప్రయోజనం ఉంది. ఈ స్కీమ్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల రూ.14,49,034 మొత్తం లభిస్తుంది. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హత పొందుతాయి. ఈ స్కీమ్‌లో కనీస పెట్టుబడి రూ.100 ఉండగా.. మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంది. అయితే 2024 అక్టోబర్ నుంచి ఈ స్కీమ్ కింద చేసే డిపాజిట్లకు ఎలాంటి వడ్డీ వర్తించబోదని ప్రకటించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు