బంగారం ధరలు గత కొన్ని రోజులనుంచి చుక్కలు చూపిస్తున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ లక్ష దగ్గరకు చేరింది. బంగారం కొనాలనుకునే వారికి షాక్ ఇచ్చింది. అయితే, గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు శనివారం తగ్గాయి.
భాగ్యనగరంలో బంగారం ధరలు ఇలా
హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,300 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,600 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,700 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 99,590 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 91,290 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,690 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
నగరంలో వెండి ధరలు ఇలా ..
మే నెల చివరి వారం వరకు వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ, జూన్ ప్రారంభం నుంచి వెండి ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10,700 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,07,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు పెరిగింది. 100 గ్రాముల వెండి ధర నేడు 10,710 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,07,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.