హాట్ కేక్‌లా మారిన మారుతీ కారు.. 36 నెలల్లో ఏకంగా..

మారుతీ సుజుకి నుంచి గ్రాండ్ విటారా హాట్ కేక్ లా మారింది. జనం దీన్ని బీభత్సంగా కొంటున్నారు. కేవలం 32 నెలల్లో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ SUV షార్ట్ టైమ్ లోనే స్టాండ్ ఔట్ పెర్ఫార్మర్ గా మారింది. దేశ SUV మార్కెట్‌లో బ్రాండ్ స్థానాన్ని బలోపేతం చేసింది.

మారుతి సుజుకి గ్రాండ్ విటారా మిడ్-సైజ్ SUV విభాగంలో దూసుకుపోతోంది. కేవలం 32 నెలల్లో 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించిన అత్యంత వేగవంతమైన మోడల్‌గా అవతరించింది. ఈ మైలురాయి మారుతి సుజుకికి ఒక ముఖ్యమైన విజయం. SUV రంగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసింది.

ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లకున్న ప్రజాదరణ. ఇది FY24-25లో 43% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌, ALLGRIP SELECT 4×4 సిస్టమ్ వంటి ఫీచర్లు, పనితీరు ఈ మోడల్ కు మరింత ఆకర్షణ తెచ్చాయి.

ఈ విజయంపై MSIL మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పందించారు. కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “మారుతి సుజుకిపై నమ్మకం ఉంచినందుకు మా 3 లక్షల మంది గ్రాండ్ విటారా కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గ్రాండ్ విటారా మిడ్-SUV మార్కెట్లో మా స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా ఉంది. ప్రత్యేక డిజైన్, సేఫ్టీ ఫీచర్స్, అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది” అని ఆయన తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు