బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ఆభరణాల వ్యాపారులు, స్టాకిస్టుల అమ్మకాలతో ధరలు దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.100 తగ్గి.. తులానికి రూ.97,670కి పతనమైంది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.100 తగ్గి.. తులం రూ.97,250కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది. ఏడు రోజుల ర్యాలీ తర్వాత మంగళవారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. రూ.1000 తగ్గి కిలోకు రూ.1,07,100కి తగ్గింది. విదేశీ మార్కెట్లో స్పాట్ బంగారం స్వల్పంగా పెరిగి ఔన్సుకు 3,329.12 డాలర్లకు చేరుకుంది. స్పాట్ వెండి 0.3 శాతం తగ్గి ఔన్సుకు 36.64కి చేరుకుంది.
అమెరికా, చైనా మధ్య వాణిజ్యం అంచనాలు బంగారం ధరను తగ్గించాయని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. లండన్లో చైనా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండగా.. ఇది ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఒప్పందంపై ఎన్నో ఆశలున్నాయి. ఈ వారం బంగారం ధరల్లో అస్థిరత పెరిగే అవకాశాలున్నట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.97,580 ఉండగా.. 22 క్యారెట్ల పసిడి రూ.89,450 పలుకుతుదున్నది. ఇక వెండి కిలో రూ.1.19లక్షలు పలుకుతున్నది.