అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్స్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్షణంలో తమ బాధ వర్ణనాతీతమని చంద్రశేఖరన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ 171 విమాన ప్రమాదం విషాద సంఘటనతో తాము తీవ్రంగా వేదనకు గురయ్యామని.. ఈ సమయంలో తాము అనుభవిస్తున్న దుఃఖాన్ని వ్యక్తపరిచేందుకు పదాలు కూడా లేవని పేర్కొన్నారు. తమ ఆలోచలన్నీ ప్రమాదంలో ప్రియమైన వారిని కోల్పోయిన వారి, గాయపడ్డవారి కుటుంబాలతోనే ఉన్నాయని చంద్రశేఖరన్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని ఎయిర్ ఇండియా అందిస్తుందని వెల్లడించారు.
గాయపడ్డ వారి వైద్య ఖర్చులను భరించనున్నట్లు వెల్లడించారు. అవసరమైన మద్దతు అందేలా చూస్తామన్నారు. జేబీ మెడికల్ ఆసుపత్రి హాస్టల్‌ను నిర్మించి ఇస్తామన్నారు. ఈ రోజు తన వృత్తి జీవితంలో అత్యంత విషాదకరమైన రోజని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా విమానం ఏ-171 అహ్మదాబాద్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రమాదంలో దాదాపు 186 మంది వరకు చనిపోగా మృతదేహాలను రికవరీ చేశారు. అయితే, ఘోర ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఉన్న ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ కాగా.. రెండు నిమిషాల్లోనే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కేవలం రెండు సె లోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ పై టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. ప్రమాదంలో మిగతా ఎవరూ ప్రాణాలు బయటపడేందుకు అవకాశం లేదని అధికార వర్గాలు తెలిపాయి.