ఎగిరి గంతేసే ఆఫర్.. హ్యుందాయ్ కార్లపై అదిరే ఆఫర్లు.. రూ. 85 వేల వరకు తగ్గింపు..

కొత్తగా కార్లు కొనాలనుకునే వారికి శుభవార్త. హ్యుందాయ్ ఇండియా తమ వాహన శ్రేణిలో నాలుగు మోడళ్లపై గరిష్టంగా రూ. 85,000 వరకు తగ్గింపులను అందిస్తోంది, ఇందులో i20, వెన్యూ, ఎక్స్టర్, గ్రాండ్ i10 NIOS ఉన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఈ వాహన తయారీ సంస్థ.. ప్రతి నెలా ఈ హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలపై ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఏప్రిల్‌లో గరిష్ట తగ్గింపు రూ. 70,000గా ఉంది. ఈసారి, తయారీదారు తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ పంకజ్ త్రిపాఠిని కూడా ఈ అమ్మకాల ప్రమోషనల్ పోస్టర్‌లో ప్రదర్శించారు. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపులు, ట్రేడ్-ఇన్ డిస్కౌంట్లు, స్క్రాపేజ్ బోనస్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. తయారీదారు షరతులు, నిబంధనలు వర్తిస్తాయి. ప్రయోజనాలు వివిధ నగరాల్లో మారొచ్చు. అంటే ఒక్కోచోట ఒక్కోలా ఉండొచ్చు.

హ్యుందాయ్ ఎక్స్టర్ విషయానికి వస్తే, ఇది కాంపాక్ట్ SUV.. టాటా పంచ్‌కు గట్టి పోటీదారుగా ఉంది. ప్రస్తుతం, ఈ వాహనంపై రూ. 55,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీని ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది. ఇది 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది, ఇది 82 bhp శక్తిని, 113.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT ట్రాన్స్‌మిషన్‌తో యాడ్ అయి ఉంటుంది. ఇంకా.. CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది, ఇది 68 bhp, 95.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ i20 విషయానికి వస్తే, ఇది రూ. 55,000 వరకు డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7.04 లక్షల నుంచి రూ. 11.24 లక్షల వరకు ఉంటుంది. ఇది యువ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. ఇది 1.2-లీటర్ కప్పా ఇంజిన్‌తో వస్తుంది, ఇది 86.7 bhp శక్తిని, అలాగే 114.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT) ఎంపికలతో లభిస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు