దేశీయ స్టాక్ మార్కెట్లు వారంలో తొలిరోజైన సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒకశాతం వరకు లాభాలను నమోదు చేశాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా మార్కెట్లు రాణించాయి. సెన్సెక్స్ కిత్రం సెషన్‌తో పోలిస్తే 81,034.45 పాయింట్ల వద్ద ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 81,012.31 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 81,865.82 పాయింట్ల వరకు పెరిగింది. నిఫ్టీ 227.90 పాయింట్లు లేదా 0.92 శాతం పెరిగి 24,946.50 వద్ద ముగిసింది. దాదాపు 1898 షేర్లు లాభపడగా.. 2,026 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఎస్బీఐ లెఫ్ ఇన్సూరెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ ఉన్నాయి. అయితే టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా నష్టపోయాయి. ఐటీ, మెటల్, రియాలిటీ, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి ఒకశాతం పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.9 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి.