పోస్టాఫీస్‌లో అద్భుతమైన స్కీమ్.. ఇలా పెట్టుబడి పెడితే.. ప్రతి నెలా రూ. 5వేలు సంపాదన..

పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన సేవింగ్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. అదే.. పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్ స్కీమ్ (Post Office Special Scheme).. ఈ పథకంలో ఇలా పెట్టబడితో ప్రతినెలా రూ. 5వేలు సంపాదించుకోవచ్చు. పోస్టాఫీసులో అన్ని వయస్సులు, తరగతి వారికి అనేక సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

అద్భుతమైన రాబడితో పాటు మీ పెట్టుబడి భద్రత కూడా ఉంటుంది. ప్రత్యేకమైన పథకాలలో పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం.. ప్రతి నెలా పెట్టుబడిపై మంచి ఆదాయాన్ని అందిస్తుంది. మీరు కూడా పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకోండి.

7.4శాతం రేటుతో వడ్డీ :
ఈ నెలవారీ ఆదాయ పథకంపై పోస్టాఫీసు అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ప్రభుత్వం ఈ పథకంలో 7.4 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి ద్వారా ఆదాయ ఒత్తిడి ఉండదు. మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏడాది వరకు డబ్బును విత్‌డ్రా చేయలేరు. కేవలం రూ.1000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

రూ. 9 లక్షల వరకు పెట్టుబడి :
పోస్టాఫీస్ మంత్లీ సేవింగ్స్ స్కీమ్ (POMIS) కింద పెట్టుబడి పెట్టే ఖాతాదారులకు పెట్టుబడి పరిమితి రూ. 9 లక్షలు. జాయింట్ అకౌంట్ గరిష్ట పరిమితి రూ. 15 లక్షలుగా ఉంటుంది. ఈ పరిమితిని గత ఏడాది ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చింది. సింగిల్ ఇన్వెస్ట్ మెంట్ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టాక ప్రతి నెలా గ్యారెంటెడ్ ప్రాఫిట్ పొందవచ్చు.

ముందుగా క్లోజ్ చేస్తే ఛార్జీలు తప్పవు :
ఈ పథకంలో మీరు అకౌంట్ ఓపెన్ చేశాక ఏడాది వరకు క్లోజ్ చేయలేరు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అకౌంట్ 3 ఏళ్ల ముందు క్లోజ్ చేస్తే.. 2 శాతం ఛార్జీ చెల్లించాలి. 3 ఏళ్ల తర్వాత నుంచి 5 ఏళ్ల ముందు ఈ అకౌంట్ క్లోజ్ చేస్తే ఒక శాతం ఛార్జీ పడుతుంది.

అకౌంట్ ఓపెన్ వెరీ ఈజీ :
నెలవారీ ఆదాయ పథకం (MIS) కింద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లాలి. అవసరమైన డాక్యుమెంట్లతో పాటు దరఖాస్తును పోస్టాఫీసులో సమర్పించవచ్చు. దరఖాస్తుదారులు పోస్టాఫీసు నుంచి అకౌంట్ ఓపెన్ ఫారమ్‌ తీసుకోవాలి.

KYC ఫారమ్, పాన్ కార్డ్‌తో సమర్పించవచ్చు. జాయింట్ ఖాతాదారుల విషయంలో కూడా KYC డాక్యుమెంట్లను సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ చేసే ఫారమ్‌ను నింపేటప్పుడు.. అన్ని వివరాలను కరెక్టుగా ఇవ్వాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు