ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్ ఫండ్‌ను తీసుకొచ్చింది. ఇది నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తుంది. ఈ ఫండ్ సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంది. జులై 3తో గడువు ముగుస్తుంది. స్టాక్ మార్కెట్లో కొత్త పెట్టుబడి అవకాశాల కోసం చూసేవారికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ఫండ్ ద్వారా నిఫ్టీ200లోని టాప్ 30 కంపెనీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఇది ఓపెన్-ఎండెడ్ పథకం. అంటే ఇందులో ఎప్పుడైనా పెట్టుబడి పెట్టొచ్చు, తీసుకోవచ్చు. ఈ ఫండ్ నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్‌ను అనుసరిస్తుంది. అంటే ఆ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల్లోనే ఇది కూడా పెట్టుబడి పెడుతుంది.
ఈ ఫండ్ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీల రాబడికి సమానంగా రాబడిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇందులో ట్రాకింగ్ ఎర్రర్ వచ్చే అవకాశం ఉంది. ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఇండెక్స్ రాబడికి, ఫండ్ రాబడికి మధ్య వ్యత్యాసం. నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్‌లో.. నిఫ్టీ200లోని టాప్ 30 కంపెనీలు ఉంటాయి. వీటిని మొమెంటం ఆధారంగా ఎంపిక చేస్తారు. మొమెంటం అంటే స్టాక్ ధర పెరుగుదల వేగం. ఇటీవల ధరల పనితీరును, రిస్క్-అడ్జస్టెడ్ రాబడులను పరిగణనలోకి తీసుకుని స్టాక్లను ఎంపిక చేస్తారు.
ఈ ఫండ్‌లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 5,000. అదనపు కొనుగోళ్లకు రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా కూడా పెట్టుబడి పెట్టొచ్చు. రోజువారీ, వారం, నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. సిప్ అంటే ఒకేసారి కాకుండా నెలనెలా కొంత మొత్తం పెట్టుబడి పెట్టడం.
ఎస్బీఐ నిఫ్టీ200 మొమెంటం 30 ఇండెక్స్ ఫండ్‌కు.. వైరల్ చద్వా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫండ్ నిఫ్టీ200 ఇండెక్స్ నుంచి ఎంపిక చేసిన 30 ‘హై మొమెంటం’ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. వీటిలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ రెండూ ఉంటాయి. ‘నార్మలైజ్డ్ మొమెంటం’ స్కోర్ల ఆధారంగా వీటిని ఎంపిక చేస్తారు. లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలు, మిడ్ క్యాప్ అంటే మధ్య తరహా కంపెనీలు.