మీరు తెలివైన ఇన్వెస్టర్లా?.. మీ సంపదను వేగంగా పెంచుకోవాలని చూస్తున్నారా?

ఐదేళ్లలో ధనవంతులు అవ్వాలంటే? బంగారం కొనాలా, నిఫ్టీలో పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే.. చదివి తెలుసుకోండి మరి…

ఐదేళ్ల కిందట రూ. 5 లక్షలు పెడితే బంగారం కొనుంటేనా, లేక నిఫ్టీ 50లో పెట్టుబడి పెట్టి ఉంటేనా… ఏది అధిక లాభాన్ని ఇచ్చి ఉండేది? ద్రవ్యోల్బణానికి రక్షణగా బంగారాన్ని చూస్తారు. కానీ, ఈక్విటీ దీర్ఘకాలంలో అద్భుత వృద్ధిని నమోదు చేసింది. ఈ రెండింటిలో ఏది ఇన్వెస్టర్ల సొమ్మును వేగంగా పెంచిందో తెలుసుకోండి.

ఐదేళ్ల కాలంలో భౌతిక బంగారం, నిఫ్టీ 50 సూచీ రెండూ 90 శాతానికి పైగా అబ్సల్యూట్ రిటర్న్ ఇచ్చాయి. ఈక్విటీలో పెట్టుబడి ఐదేళ్లలో ఎంతో మందికి సంపదను పెంచింది. ఇది సామాన్యుడిని కోటీశ్వరుడిగా చేసింది. బంగారం, నిఫ్టీ 50లో పెట్టుబడులు పెట్టిన వారు అధిక రాబడిని కోరుకుంటారు. ఈ రెండు పెట్టుబడులు ఒకదానికొకటి సంబంధం లేనివి. స్వల్ప, దీర్ఘకాలంలో విభిన్న ఫలితాలు ఇవ్వగలవు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ అనిశ్చితి మధ్య బంగారం విలువ పెరిగింది. మరోవైపు, భారత్‌లో మార్కెట్ క్యాపిటలైజేషన్ అధికంగా గల 50 అతిపెద్ద కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ 50, ఒక సంవత్సరంలో కేవలం 4.68 శాతం రాబడిని ఇచ్చింది. కానీ ఐదేళ్ల కాలంలో స్థిరమైన వృద్ధిని సాధించింది.

మీరు ఐదేళ్ల కిందట రూ. 5 లక్షలు ఈ రెండింటిలో ఏది పెట్టుబడిగా పెట్టి ఉంటే అధిక లాభం వచ్చేది? పోలికల ద్వారా, ఐదేళ్లలో ఏది ఇన్వెస్టర్ల సంపదను వేగంగా పెంచిందో తెలుసుకోండి.

ఐదేళ్ల క్రితం భౌతిక బంగారం ధర
ఐదేళ్ల క్రితం, నేడు ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధరలను తీసుకుంటున్నాం.

2020 జులై 7న ముంబైలో బంగారం ధర గ్రాముకు రూ. 4,626.

నేడు (2025 జులై 10) అదే నగరంలో అదే నాణ్యత గల బంగారం ధర గ్రాముకు రూ. 8,861.

శాతంలో చెప్పాలంటే, ఐదేళ్ల ధరల పెరుగుదల 91.54 శాతం.

బంగారంపై రూ. 5 లక్షల పెట్టుబడి విలువ నేడు
ఐదేళ్ల కిందట భౌతిక బంగారంపై పెట్టిన రూ. 5 లక్షల పెట్టుబడి అంచనా విలువ నేడు రూ. 9,57,700.

నిఫ్టీ 50 సూచీ పనితీరు 5 ఏళ్లలో
నేడు (2025 జులై 10) నిఫ్టీ 50 సూచీ 25,461.30 వద్ద ముగిసింది.

ఐదేళ్లలో సూచీ వృద్ధి 135.76 శాతం.

నిఫ్టీలో రూ. 5 లక్షల పెట్టుబడి విలువ
ఐదేళ్ల కాలంలో 135.76 శాతం అబ్సల్యూట్ రిటర్న్ తో, నిఫ్టీ 50 సూచీలో పెట్టిన రూ. 5 లక్షల పెట్టుబడి రూ. 11,78,800గా మారింది.

ఒక సంవత్సర కాలంలో నిఫ్టీ 50 సూచీని బంగారం అధిగమించినప్పటికీ, ఐదేళ్ల కాలంలో మాత్రం నిఫ్టీ 50 రాబడి కంటే బంగారం బాగా వెనుకబడి ఉందని ఇది చూపిస్తుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు