యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (యూనిటీ బ్యాంక్).. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా తొలుత హైదరాబాద్‌లో ఐదు శాఖలను ప్రారంభించింది. ఈ శాఖలను దిల్సుఖ్నగర్, ఎస్ఆర్ నగర్, మౌలాలి, సుచిత్ర క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసినట్లు యూనిటీ బ్యాంక్ ఎండీ, సీఈఓ ఇంద్రజిత్ కమోత్రా వెల్లడించారు. రానున్న కొద్ది రోజుల్లో హైదరాబాద్‌లో మరో మూడు శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడల్లో శాఖలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలందించే ఉద్దేశంతో ఈ దీపావళి నాటికి క్రెడిట్ కార్డ్ విభాగంలోకి ప్రవేశించటంతో పాటు వ్యక్తిగత రుణాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇంద్రజిత్ తెలిపారు.
Post Views: 183









