మీరు ఫాస్టాగ్  వాడుతున్నారా?.. అయితే నేటి నుంచి కొత్త రూల్స్..

అలా జరిగితే రీప్లేస్ చేయాల్సిందే

 వాహనదారులకు బిగ్ అలర్ట్. మీరు ఫాస్టాగ్  వాడుతున్నారా? అయితే ఆగస్టు 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. టోల్ గేట్ల వద్ద ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాహనదారులు తప్పకుండా తమ ఫాస్టాగ్ నో యువర్ కస్టమర్ (KYC) అప్డేట్ చేసుకోవాలని సూచించింది. గత మూడేళ్లలో తీసుకున్న ఫాస్ట్ ట్యాగ్‌లన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. అటే గత మూడేళ్లలో తీసుకున్న ఫాస్టాగ్ ల కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఫాస్టాగ్ తీసుకుని 5 ఏళ్లు ఆపైన సమయం అయి ఉంటే వాటిని రీప్లేస్ చేయించుకోవాలని కేంద్రం సూచించిది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది.

ఫాస్టాగ్ జారీ చేసే సంస్థలు వాహనదారులు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సమాచారం ఇవ్వాలి. వాహనం ముందు భాగం, వెనక భాగానినికి సంబంధించిన ఫోటోలను అందించాలి. దీంతో టోల్ గేట్ల వద్ద వాహాన్ని గుర్తించడం సులభతరమవుతుంది. అక్టోబరు 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. అయితే, సాధ్యమైనంత త్వరగా కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం సూచిస్తోంది. 2019 నుంచి టోల్ గేట్ల వద్ద పేమెంట్లను ఈజీ చేసేందుకు, ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు పాస్టాక్ వ్యవస్థను తీసుకొచ్చారు. కేంద్ర రవాణా శాఖ ప్రారంభించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు