(మార్కెట్ కబుర్లు, హైదరాబాద్):
బంగారం కొనాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా ఎగబాకాయి. వరుసగా నాలుగో రోజు పసిడి ధర పెరిగినా.. ఇవాళ అంతకుమించి పెరగడం గమనార్హం. దీంతో ఇన్ని రోజులు తగ్గిందంతా మళ్లీ పెరుగుకుంటూ పోతోంది. రోజూ దాదాపు రూ. 1000 వరకు పెరుగుతుండటమే ఆందోళన కలిగిస్తోంది.
ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఇదే కనిపిస్తుంది. ఇప్పుడు దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు భారీ స్థాయిలో పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2569 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా ఎగబాకి ప్రస్తుతం ఔన్సుకు 27.95 డాలర్ల వద్ద ఉంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.92 వద్ద ట్రేడవుతోంది.
దేశీయ మార్కెట్లలో చూసినట్లయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ పసిడి ధర రూ. 950 పెరిగి తులం రూ. 65,650 వద్ద ఉంది. ఇది అంతకుముందు వరుస రోజుల్లో రూ. 250, రూ. 200, రూ. 750 చొప్పున పెరిగింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే తాజాగా రూ. 1040 పెరగ్గా 10 గ్రాములకు రూ. 71,620 వద్ద ఉంది. గత 3 సెషన్లలో ఇది రూ. 270, రూ. 220, రూ. 820 చొప్పున ఎగబాకింది.
దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే విధంగా బంగారం ధరలు పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్స్ పుత్తడి ధర రూ. 950 పెరిగి 10 గ్రాములకు రూ. 65,800 గా ఉంది. ఇదే సమయంలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1040 ఎగబాకి తులం రూ. 71,770 వద్ద ఉంది.
గోల్డ్ రేట్ల బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కిందటి సెషన్లో సిల్వర్ రేటు తగ్గినప్పటికీ ఇవాళ ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో తాజాగా రూ. 1000 పెరగ్గా కేజీకి రూ. 88,500 వద్ద ఉంది. కిందటిరోజు రూ. 600 తగ్గింది. ఢిల్లీలో కూడా వెండి రేటు రూ. 1000 పెరిగి ప్రస్తుతం కేజీకి రూ. 83,500 గా ఉంది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. స్థానిక పన్ను రేట్లు ప్రభావం చూపిస్తుంటాయి.









