నిజంగా నిర్మలమ్మే..! నిరాడంబర జీవితమే.. కారు కూడా లేదు.. ఆమె ఆస్తులెంతో తెలుసా?

65వ ఏట అడుగుపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి

(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్‌):
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఆగస్ట్‌ 18న (ఆదివారం) 65వ ఏట అడుగుపెట్టారు. ఆర్థిక మంత్రిగా ఆమె ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని తన పేరిట లిఖించుకున్నారు. ఇక ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నిర్మలమ్మ ఆస్తులు ఎంతో తెలుసా.. ఆమె దగ్గర కనీసం కారు కూడా లేదట. ఇక ఆమె పీపీఎఫ్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ఉన్నాయి.
ఆర్థిక మంత్రి పాత్ర కీలకం..
భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రి పాత్ర ఎంతో కీలకం. ఆర్థికపర నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఈ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు తెలుగింటి కోడలు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. ఈమె ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టి అరుదైన రికార్డు సృష్టించారు. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. అంతకుముందు మొరార్జీ దేశాయ్‌ 6 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ఆదివారం రోజు 65వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగానే ఆమె ఆస్తులు సహా ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

రాజ్యసభకు నామినేషన్‌ వేసే సమయంలో నిర్మలమ్మ ఇచ్చిన అఫిడవిట్‌లో.. తనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆస్తులు, పెట్టుబడులు, బ్యాంక్‌ అకౌంట్లో డబ్బులు ఇలా అన్ని వివరాల్ని పొందుపరిచారు. దీని ప్రకారం ఆమె దగ్గర ఎంత డబ్బు ఉంది? స్థిర, చర ఆస్తుల విలువ ఎంత.. వంటి వివరాల్ని చూద్దాం.
దేశ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న నిర్మలా సీతారామన్‌ కు కూడా అప్పులు ఉన్నాయి. 2022లో ఆమె అఫిడవిట్‌ ప్రకారం.. రూ. 26.91 లక్షల అప్పులు ఉన్నాయి. ఇక ఆమె ఆస్తి విలువ మొత్తం రూ. 2.53 కోట్లుగా పేర్కొన్నారు. దీంట్లో స్థిరాస్తులు రూ. 1.87 కోట్లు కాగా.. చరాస్తులు రూ. 65.55 లక్షలుగా ఉంది.

సీతారామన్‌ పేరు మీద బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఉంది. దీని విలువ రూ. 28,200 గా పేర్కొన్నారు.
బ్యాంక్‌ అకౌంట్‌లో కేవలం రూ. 7,350 నగదు మాత్రమే ఉంది.
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ అకౌంట్‌లో రూ. 1.60 లక్షలు ఉన్నాయి.
మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడుల విలువ రూ. 5,80,424.
ఇక హైదరాబాద్‌ సమీపంలోని మంచిరేవుల దగ్గర రూ. 1.70 కోట్ల విలువచేసే రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ (నివాస స్థలం) ఉంది. ఇది తన భర్త డా. పరకాల ప్రభాకర్, తన ఇద్దరి పేరు మీద ఉంది.
రూ. 17 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు