దేశీయ మార్కెట్లోకి ఆడీ నయా మాడల్‌.. ధర ఎంతో తెలుసా?..

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ.. దేశీయ మార్కెట్లోకి నయా మాడల్‌ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్తు బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. భద్రత ప్రమాణాలు మెరుగుపరచడంలో భాగంగా ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లను నెలకొల్పింది.

వైర్‌లెస్‌ చార్జింగ్, రెండు డిజిటల్‌ స్క్రీన్లు, 3డీ సౌండ్‌ సిస్టమ్‌తో 17 స్పీకర్లు వంటి ఫీచర్లతో ఈ నయా కారును తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా ఆడీ ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్‌ మాట్లాడుతూ..ఈవీలతో పోలిస్తే హైబ్రిడ్‌ వాహనాలపై అత్యధికంగా 43 శాతం పన్నును విధిస్తున్నారని, దీనిని తగ్గించాలన్నారు. గత 15 ఏళ్లలో లక్ష యూనిట్లను దేశీయంగా విక్రయించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు