ఆర్థికంగా స్థిరపడాలని ఉందా.. అయితే మ్యూచువల్‌ ఫండ్లలో..

నెలకు రూ.10 వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా
(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవాలన్నా, అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నా వీలైనంత త్వరగా ఇన్వెస్ట్‌ చేయడం తప్పనిసరి. ఇందు కోసం మీరు సంపాదిస్తున్న ఆదాయంలో కనీసం 20 శాతం నుంచి 30 శాతం వరకూ పెట్టుబడులకు మళ్లించాలి. అప్పుడే దీర్ఘకాలంలో మంచి రాబడి వస్తుంది. భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుంది. మనలో చాలా మందికి నెలవారీ జీతం తక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయడం సాధ్యం కాదు.

నెలకు రూ.పదివేలతో..
నెలకు కనీసం రూ.10 వేలతో పెట్టుబడులను ప్రారంభించవచ్చు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్‌ ఫండ్లను కనీసం మూడింటిని ఎంచుకోండి. ఒక దానిలో కనీసం రూ.2వేలు పెట్టుబడి పెట్టండి. మరో ఫండ్‌లో రూ.1,000, ఇంకో ఫండ్‌లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయండి. ఓ రూ.2,000లను జాతీయ పింఛను పథకం (ఎ¯Œ పీఎస్‌)లో జమ చేయండి. దీని వల్ల పదవీ విరమణ తరువాత మీకు మంచి కార్పస్‌ (నిధి) ఏర్పడుతుంది.అత్యవసర నిధి కోసం బ్యాంకులో రికరింగ్‌ డిపాజిట్‌ ఓపెన్‌ చేయండి. దీనిలో కనీసం నెలకు రూ.2,000 చొప్పున పొదుపు చేయండి. అనుకోని పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించేందుకు బీమా పాలసీలు తీసుకోవాలి. ఆరోగ్య బీమా, టర్మ్‌ ఇన్సూరె¯Œ ్స కోసం నెలకు రూ.1,000 కేటాయించండి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు