రెతన్న అలర్ట్‌.. రూ.5 వేల పెట్టుబడి.. రూ.50 వేల సంపాదన..

(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్‌):
రైతులు.. అంతర్‌ పంటలు సాగు చేసినప్పుడు.. బుడమకాయల పంటను సాగు చేసినట్లయితే అధిక లాభాలు పొందవచ్చని ఆదర్శ రైతు చెబుతున్నారు. ఆ రైతు ఆలోచన విధానం ద్వారా రూ. 5వేల ఖర్చుతో 50వేల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. పంట మార్పిడి విధానంతో పంటలు పండిస్తూ ఉన్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో షరీఫ్‌ అనే రైతు.. తనకున్న 30 ఎకరాలలో కంది పంటతో పాటు, బుడంకాయల సాగు కూడా చేస్తున్నారు, ఇలా సాగు చేయడం వల్ల రైతన్న అధిక ఆదాయాన్ని పొందవచ్చని ‘మార్కెట్‌ కబుర్లు’ ప్రతినిధికి తెలిపారు. ఒకే పంట వేయడం వల్ల రైతు ఆశించినంత ఆదాయం రాదని అన్నారు. ‘కంది పంట చేతికి రావాలంటే దాదాపుగా ఆరు నెలల సమయం పడుతుంది. అలాంటప్పుడు అందులో అంతర్‌ పంటలు వేసినట్లయితే రైతుకు త్వరగా పంట చేతికి వస్తుంది. అదేవిధంగా అంతకుమించి ఆదాయం కూడా లభిస్తుంది. బుడంకాయల సాగును చేయటంతో చాలా ఆదాయం ఉందని షరీఫ్‌ అనే రైతు చెబుతున్నారు.

ఈ బుడమకాయల పంట త్వరగానే వస్తుంది. అందులోనూ మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం అయితే అధిక వర్షాలు కురవడంతో, బుడంకాయల పంట కొద్దిగా దెబ్బ తిన్నది. వర్ష ప్రభావం కొద్దిగా తక్కువ ఉండి ఉంటే, రైతు ఆశించిన ఆదాయం కంటే అధికంగా ఆదాయం వచ్చేది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేటుకు రైతు లాభ దిశంగానే ఉంటుంది. బుడంకాయల పంట సాగు కోసం రైతులు అధికంగా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. అధికంగా రసాయనిక ఎరువుల ద్వారా పిచికారీ చేయాల్సిన అవసరం ఉండదని షరీఫ్‌ అనే రైతు చెబుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు