ప్రముఖ పారిశ్రామికవేత్త బజాజ్ కుమార్తె మరణం.. తీవ్ర విషాదంలో కుటుంబం

ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ ఇంట తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. అతని కుమార్తె కమల్‌నయన్‌ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ మరణించారు.   మూడేళ్ల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ ముంబైలో మరణించారు. ఈమెకు ఆర్యమాన్, నిర్వాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సునైనా భర్త కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్‌నర్‌ మనీష్ కేజ్రీవాల్.

కళల పట్ల ఆసక్తితో..

సునైనాకి కళల పట్ల ఆసక్తి ఉండటంతో బజాజ్ హాల్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా ఆమె కృషి చేశారు. పూణేలోని SNDT కాలేజీలో ఆమె టెక్స్‌టైల్స్‌లో స్కిల్స్‌ పొందారు. అలాగే ముంబైలోని సోఫియా కాలేజీలో ఒక ఏడాది పాటు సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ కోర్సులో విద్యను అభ్యసించారు. బజాజ్ కుటుంబానికి ఎన్నో ఛారిటబుల్ ట్రస్ట్‌లు ఉన్నాయి. సొనైనా తన భర్తతో కలిసి కేదారా క్యాపిటల్‌ను స్థాపించారు. ప్రైవేట్ ఈక్విటీ అయిన ఈ సంస్థకి 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు