నెలకు రూ. 10 వేలు ఇన్వెస్ట్‌ చేస్తే చేతికి రూ. 1.60 కోట్లు.. నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):
మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్లతో సంపదను పెంచుకోవచ్చు. దీర్ఘకాలంలోనే ఇక్కడ మంచి రిటర్న్స్‌ అందుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. చాలా ఫండ్‌ స్కీమ్స్‌.. కొన్నేళ్లలో ఇన్వెస్టర్ల సంపదను ఎన్నో రెట్లు పెంచాయని తరచుగా వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు రూ. 10 వేల సిప్‌తో 19 సంవత్సరాల్లో రూ. 1.60 కోట్లు అందించిన మ్యూచువల్‌ ఫండ్‌ పథకం గురించి బిజినెస్‌ రంగ నిపుణుడు పూర్ణచందర్‌ ఏం చెబుతున్నారంటే..

ఆదిత్య బిర్లా మ్యూచువల్‌ ఫండ్‌
పెట్టుబడులు పెట్టి డబ్బులు సంపాదించేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌ అనేది మంచి ఎంపికగా చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ ముఖ్యంగా ఓపిక ఉండాలి. ఇలా లాంగ్‌ రన్‌లో అదిరిపోయే రిటర్న్స్‌ అందించిన పథకాలు ఎన్నో ఉన్నాయి. పాస్ట్‌ రిటర్న్స్‌ తెలుసుకొని.. ఆర్థిక క్రమశిక్షణతో మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకేసారి అంటే లంప్‌ సమ్‌ ఇన్వెస్ట్‌ చేయొచ్చు. లేదా క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా కూడా పెట్టుబడులు పెట్టొచ్చ. అయితే.. లంప్‌ సమ్‌తో పోలిస్తే.. సిప్‌ ద్వారానే అధిక రిటర్న్స్‌ వస్తాయి. సిప్‌ విధానంలో ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. రూ. 10 వేల సిప్‌ ద్వారా కూడా రూ. కోటికిపైగా సంపద సృష్టించుకోవచ్చు. దీనికి కొన్నేళ్లు పడుతుంది.

ఇటీవలి కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ పెట్టుబడులు పెరిగాయి. ఈ క్రమంలోనే 19 సంవత్సరాల కిందట ప్రారంభమైన ఒక ఫండ్‌ గురించి తెలుసుకుందాం. ఇది కూడా రూ. 10 వేల సిప్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లు చేసింది. అదే లంప్‌ సమ్‌ అయితే.. స్కీం ప్రారంభంలో రూ. లక్ష ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే.. ఇప్పుడు అది రూ. 22.35 లక్షలుగా మారింది.

ఇదే ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఇండియా నెక్ట్స్‌ జెన్‌ ఫండ్‌. ఈ స్కీమ్‌ 2005 ఆగస్టులో ప్రారంభమైంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఈక్విటీ పథకం. ఇటీవలే 19 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ స్కీమ్‌ స్టార్ట్‌ అయినప్పుడు సిప్‌ విధానంలో రూ. 10 వేల చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తూ వస్తే ఇప్పుడు కోటీశ్వరులు అయిపోయేవారు.

ఈ ఫండ్‌ రిటర్న్స్‌ చూస్తే.. కాంపౌండ్‌ యాన్యువల్‌ గ్రోత్‌ రేట్‌ ఏడాదిలో సగటున 17.68 శాతంగా ఉంది. ఇది మూడేళ్లలో అయితే 22.38 శాతంగా ఉంది. 5 సంవత్సరాల్లో సగటున 18.84 శాతం రాబడి అందించింది. బెంచ్‌మార్క్‌ నిఫ్టీ ఇండియా కన్సంప్షన్‌ మూడేళ్ల రిటర్న్స్‌కు మించి ఇక్కడ లాభం వచ్చింది. నిఫ్టీలో రిటర్న్స్‌ 21.78 శాతంగానే ఉండగా.. ఇక్కడ 22.38 శాతంగా ఉంది. ఈ ఫండ్‌ మేనేజర్లుగా ఛంఛల్‌ ఖండేల్వాల్‌ 2015 నుంచి ఉండగా.. ధావల్‌ జోషి 2022 నుంచి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. చివరగా మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్లు మార్కెట్‌ రిస్క్‌కు లోబడి ఉంటాయి కాబట్టి.. గ్యారెంటీగా రిటర్న్స్‌ వస్తాయని చెప్పలేం. అందుకే.. వీటిల్లో పెట్టుబడులు పెట్టేముందు.. నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు