(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్):
భారత్‌లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశంలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సంస్థ ఆయిల్, టెలికాం, మీడియా, పవర్, న్యూఎనర్జీ, విండ్, రిటైల్ ఇలా ఎన్నో విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. ఇదివరకే అంబానీ.. తన వ్యాపార విభాగాల్ని తన సంతానానికి అప్పజెప్పారు. రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని ఇషా అంబానీ చూస్తుండగా.. రిలయన్స్ జియో బాధ్యతల్ని పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, న్యూఎనర్జీ విభాగం అనంత్ అంబానీ చూస్తున్నారు. అయితే.. వీరి చేతుల్లోకి వెళ్లిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా దూకుడు పెంచింది. విస్తృతంగా పెట్టుబడులు పెడుతూ.. పలు కంపెనీల్లో మెజార్టీ వాటాల్ని దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఇషా దూకుడుతో.. రిటైల్ దూసుకెళ్తోంది. ఇప్పుడు.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో పెద్ద కంపెనీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంబానీ డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు కోసం ఇప్పటికే అనుమతులు పొందగా.. స్ట్రీమింగ్ రంగంపై అంబానీ దృష్టి మరింత పెరిగింది. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ కంపెనీలో కీలక వాటాదారుగా మారాలని చూస్తున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి.









