మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం అవబోతుంది. పూజలు, వ్రతాలతో మహిళలు బిజీగా ఉంటారు. దాంతోపాటు పెళ్లిళ్లు, శుభకార్యాలు కూడా ఉంటాయి. ఇంకేముంది బంగారం ధరలకు రెక్కలొస్తాయి. రెండు, మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. గురువారం తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,200గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,840గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,750 ఉండగా, మేలిమి బంగారం ధర రూ.75,875గా ఉంది. విశాఖపట్టణంలో ఆర్నమెంట్ బంగారం ధర రూ.71,400గా ఉండగా, మేలిమి బంగారం ధర రూ.77,600గా ఉంది. చెన్నైలో ఆర్నమెంట్ బంగారం ధర రూ.71,400గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.94,531గా ఉంది. విజయవాడలో 93,600, విశాఖపట్టణంలో 94 వేలు, చెన్నైలో లక్ష 3 వేలుగా ఉంది.









