మగువలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

(మార్కెట్‌ కబుర్లు, హైదరాబాద్‌):

బంగారం, వెండి ప్రియులకు గుడ్‌ న్యూస్‌. కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్‌ పడింది. ఇటీవల పసిడి రేట్లు రూ. 80 వేల స్థాయికి చేరుకోగా, ఇప్పుడు దీపావళి పండుగకు ముందే ఈ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్‌ 25న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 620 తగ్గి రూ. 79,460కి చేరుకుంది.

ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 72,840కి చేరింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 79,610కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.72,990కి చేరుకుంది. మరోవైపు వెండి ధరలు కూడా కిలోకు వెయ్యింకిపైగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు చుద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • ఢిల్లీలో రూ. 79,610, రూ. 72,990
  • విజయవాడలో రూ. 79,460, రూ. 72,840
  • హైదరాబాద్‌లో రూ. 79,460, రూ. 72,840
  • వడోదరలో రూ. 79,510, రూ. 72,890
  • ముంబైలో రూ. 79,460, రూ. 72,840
  • బెంగళూరులో రూ. 79,460, రూ. 72,840
  • కోల్‌కతాలో రూ. 79,460, రూ. 72,840
  • చెన్నైలో రూ. 79,460, రూ. 72,840
  • కేరళలో రూ. 79,460, రూ. 72,840
  • పూణేలో రూ. 79,460, రూ. 72,840

ప్రధాన నగరాల్లో వెండి రేట్లు (కిలోకు)

  • ఢిల్లీలో రూ. 101,900
  • హైదరాబాద్‌లో రూ. 109,900
  • విజయవాడలో రూ. 109,900
  • చెన్నైలో రూ. 109,900
  • కేరళలో రూ. 109,900
  • ముంబైలో రూ. 101,900
  • కోల్‌కతాలో రూ. 101,900

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు