గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ .. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే.?

(మార్కెట్‌కబుర్లు, హైదరాబాద్‌):
దీపావళికి ముందుగా గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్ వచ్చేసింది. భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయి.   రెండు రోజులుగా 24 క్యారెట్ల బంగారంపై రూ. 820 పెరిగ్గా.. 22 క్యారెట్ల బంగారం రూ. 750 మేరకు పెరిగింది. ఇక ఆదివారంతో పోలిస్తే.. సోమవారం  స్వల్పంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

దీపావళికి ముందు ఇలా బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో.. గోల్డ్ లవర్స్ కొనుగోలు సిద్దమయ్యారనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తున్నాయ్. సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.73,590

విజయవాడ – రూ.73,590

బెంగళూరు – రూ.73,590

ముంబై – రూ.73,590

కోల్‌కతా – రూ.73,590

ఢిల్లీ – రూ.73,740

చెన్నై – రూ.73,590

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.80,280

విజయవాడ – రూ.80,280

బెంగళూరు – రూ.80,280

ముంబై – రూ.80,280

కోల్‌కతా – రూ.80,280

ఢిల్లీ – రూ.80,430

చెన్నై – రూ.80,280

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు