ధంతేరాస్ ధమాకా.. వేల కోట్లలో అమ్ముడైన బంగారం, వెండి.. ఎంతంటే?

దీపావళికి ముందు త్రయోదశి ధంతేరాస్ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఈ పండుగ హిందువులకు చాలా ప్రత్యేకం. ఈ పండుగ రోజు కోటీశ్వరుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరూ బంగారం, వెండి పాత్రలతోపాటు నూతన వస్త్రాలు, ఇల్లు, ఆస్తి మొదలైనవి ఎక్కువగా కొనుక్కుంటారు. వీటితో పాటు లక్ష్మీ దేవి ప్రతిమను కొనుక్కోవడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని.. ఇంటిల్లి పాది సుఖ సంతోషాలతో ఉంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

అయితే ఈ ఏడాది  ధంతేరాస్ సందర్భంగా దేశవ్యాప్తంగా దాదాపు రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2,500 కోట్ల విలువైన వెండి అమ్ముడు పోయిందని CAIT ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.

సుమారు 25 టన్నుల బంగారం అమ్ముడు కాగా.. దీని విలువ  రూ.20,000 కోట్లుగా ఉంది. అదే సమయంలో సుమారుగా 250 టన్నుల వెండి రూ.2,500 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయి. అదనంగా పాత వెండి నాణేలకు డిమాండ్ పెరిగింది.   దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం ధంతేరాస్ సందర్భంగా  సుమారు రూ.60,000 కోట్లు జరిగినట్లు అంచనా..

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు