మీరు ఈ వారం ఏదైనా బ్యాంక్ పనికోసం వెళ్లాలని చూస్తున్నారా. అయితే ముందుగా ఈ వారం బ్యాంకు సెలవుల గురించి తెలుసుకోండి మరి. ఎందుకంటే రేపటి నుంచి వచ్చే నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఏయే రోజుల్లో హాలిడే ఉంది. ఎన్ని రోజులు బ్యాంకులు బంద్ ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. రేపు అంటే డిసెంబర్ 25, 2024న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. ఇక డిసెంబర్ 26న కూడా బాక్సింగ్ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు కాకుండా పలు చోట్ల బ్యాంకులకు హాలిడే ఉంది.
ఆ తర్వాత శుక్రవారం రోజు బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. కానీ తర్వాత డిసెంబర్ 28, 2024న నాల్గో శనివారం, డిసెంబర్ 29, 2024న ఆదివారం బ్యాంకులకు హాలిడే. దీంతో మొత్తం ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.
Post Views: 173









