నిన్న తగ్గిన బంగారం ధరలు, ఈరోజు మాత్రం భారీగా పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు (డిసెంబర్ 27న) ఉదయం 6.10 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,800కి చేరింది. ఇది నిన్నటి ధరలతో పోల్చి చూస్తే 650 రూపాయల పెరగడం విశేషం. ఇదే సమయానికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,400 స్థాయికి చేరింది.
దీంతోపాటు హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,050 స్థాయికి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 70,629కు చేరింది. ఇక వెండి రేట్ల గురించి మాట్లాడితే కిలో వెండి రూ. 400 పెరిగి రూ. 89,760 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
- ఢిల్లీలో రూ. 76,800, రూ. 70,400
- హైదరాబాద్లో రూ. 77,050, రూ. 70,629
- విజయవాడలో రూ. 77,050, రూ. 70,629
- ముంబైలో రూ. 76,930, రూ. 70,519
- చెన్నైలో రూ. 77,150, రూ. 70,134
- కోల్కతాలో రూ. 76,830, రూ. 70,428
- బెంగళూరులో రూ. 76,990, రూ. 70,574
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
- ఢిల్లీలో రూ. 89,460
- హైదరాబాద్లో రూ. 89,760
- విశాఖపట్నంలో రూ. 89,760
- ముంబైలో రూ. 89,620
- చెన్నైలో రూ. 89,880
- కోల్కతాలో రూ. 89,500
- బెంగళూరులో రూ. 89,690
గమనిక:
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. అంతేకాదు వీటిలో GST, TCS వంటి ఇతర ఛార్జీలు కలిగి ఉండవు.









