ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క.. హైడ్రా యాక్షన్ షురూ.. 8 అంతస్తుల బిల్డింగ్ కూల్చివేత

ప్రభుత్వ భూములకు రక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటోంది హైడ్రా. ఇప్పటివరకు చెరువులు, కుంటల FTL, బఫర్‌ జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్‌ చేసిన హైడ్రా.. తాజాగా మహానగరంలోని అక్రమ నిర్మాణాలపై కూడా ఫోకస్‌ చేసింది. ఈ క్రమంలో నగరంలోని మాదాపూర్‌లో ఆక్రమణలను కూల్చివేస్తున్నది. అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్‌ రోడ్డులో ప్రధాన రహదారికి ఆనుకొని అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని బుల్డోజర్ల సాయంతో హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, హైడ్రా డీఆర్ఎఫ్ బృందాలు భారీగా మోహరించారు.

అయ్యప్ప సొసైటీలో సెట్ బ్యాక్ లేకుండా 8 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. అనుమతులు లేకుండా చేపట్టిన భవనంపై హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. ఇప్పటికే పలు మార్లు అధికారులు హెచ్చరించినా బిల్డర్ పట్టించుకోలేదు. స్థానికుల ఫిర్యాదుతో ఫీల్డ్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. అనుమతులు లేవని తేలడంతో కూల్చివేతకు ఆదేశించారు. దీంతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్నారు.

శేరి లింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలో ఉన్న 684 గజాల స్థలంలో 8 అంతస్తుల భవనం సెట్‌ బ్యాక్‌ లేకుండా నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. అయ్యప్ప సొసైటీకి చెందిన ఈ భవనం ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రాకు పలువురు ఫిర్యాదులు అందించారు. ఈ క్రమంలో సైట్ విజిట్ చేసిన హైడ్రా అధికారులు.. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు.

ఈ క్రమంలో ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలంటూ గతంలోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో GHMC అధికారులు ఓ సారి కూల్చివేశారు కూడా.. అయినప్పటికీ.. అధికారుల హెచ్చరికలు, కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా మళ్ళీ నిర్మాణాలు మొదలు పెట్టారు బిల్డర్స్. ఈ విషయం గుర్తించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం కూల్చివేతకు ఆదేశించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు