బంగారం ధరలు కొన్నాళ్లుగా షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి కొండెక్కి కూర్చుంది పసిడి. ఏకంగా రూ.80 వేల మార్క్ దాటేసి గోల్డ్ లవర్స్‌ను భయపెట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గి ఊరటను ఇచ్చాయి. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గాయి. 5 రోజుల తర్వాత పసిడి కాస్త దిగొచ్చింది. జనవరి 19వ తేదీ, ఆదివారం నాడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.150 మేర తగ్గి.. రూ.74 వేల 350 దగ్గరకు దిగొచ్చింది. అదే 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర ఇవాళ రూ.160 మేర తగ్గి.. 10 గ్రాముల రేటు రూ.81 వేల 110 వద్ద ట్రేడింగ్ అవుతోంది. గోల్డ్ రేట్ తగ్గినా సిల్వర్ రేట్ మాత్రం స్థిరంగానే ఉండటం గమనార్హం. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.1,04,000 దగ్గర అమ్ముడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఎలాంటి పన్నులు, చార్జీలు లేవు. వాటిని కలిపితే ప్రాంతాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఆదివారం ఉదయానికి సంబంధించిన రేట్స్ ఇవి. ఒక్కోసారి మధ్యాహ్నానికే ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చే చాన్స్ ఉంటుంది. కావున కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం ఉత్తమం.









