పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ధర స్వల్పంగా దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.490 తగ్గి.. తులం రూ.96,540కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. ఇక 22 క్యారెట్ల పసిడి రూ.450 తగ్గి తులం రూ.96,130కి తగ్గిందని పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లోని కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ మాట్లాడుతూ మాట్లాడుతూ మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని చెప్పారు. యూఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఆశలు రిస్క్ సెంటిమెంట్‌ను సానుకూలంగా మార్చాయన్నారు.
దాంతో బంగారం డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ఇక మంగళవారం వెండి ధర సైతం భారీగా తగ్గింది. రూ.1000 తగ్గి.. కిలో ధర రూ.97,500కి తగ్గింది. ఇదిలా ఉండగా.. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) భవిష్యత్తులో వడ్డీ రేటు కోతలు విధించనున్నారనే అంచనాలతో వ్యాపారులు అనిశ్చితిలో ఉన్నారని సౌమిల్ గాంధీ తెలిపారు. ఇదిలా ఉండగా.. విదేశీ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ స్వల్పంగా పెరిగి ఔన్స్‌కు 3,233.68కి చేరుకుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.87,100 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.95,020 ధర పలుకుతుంది. వెండి కిలోకు రూ.1.08లక్షలు పలుకుతున్నది.