రికార్డ్ సృష్టిస్తోన్న వెండి ధర.. దీపావళి నాటికి కిలో ఎంతకు చేరుకుంటుందో తెలిస్తే షాకే..

ఈ రోజుల్లో వెండి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. నిరంతరం రికార్డులను బద్దలు కొడుతున్న వెండి ధరలు.. ఇప్పుడు కొత్త శిఖరాల వైపు కదులుతున్నాయి. ఈ దీపావళి నాటికి వెండి ధర కిలోకు రూ.1.30 లక్షలకు చేరుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనా పెట్టుబడిదారులకే కాదు, సామాన్యులకు కూడా పెద్ద సంకేతం.

కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ సురేష్ కేడియా ప్రకారం.. దీపావళి వరకు వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ధర రూ. 1 లక్ష 25 వేల నుంచి రూ. 1 లక్ష 30 వేలకు పెరగవచ్చు. దీనికి ప్రపంచ మార్కెట్లో సాంకేతిక పురోగతి అతిపెద్ద కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్సుకు $37 స్థాయిని తాకింది. ఇది ఒక ముఖ్యమైన కారణం అంతేకాదు అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం పారిశ్రామిక డిమాండ్‌ను పెంచింది. క్లీన్ ఎనర్జీ, 5G టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) వంటి పారిశ్రామిక రంగాలలో వెండిని 53-56% వరకు ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా వెండికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

బంగారం-వెండి నిష్పత్తి ప్రభావం

ప్రస్తుతం బంగారం వెండి నిష్పత్తి 91కి దగ్గరగా ఉందని,.. బంగారంతో పోలిస్తే వెండి ఇప్పటికీ పెట్టుబడికి ఆకర్షణీయంగా ఉందని ఇది చూపిస్తుందని అజయ్ కేడియా అన్నారు. చారిత్రాత్మకంగా ఈ నిష్పత్తి అరుదుగా 90 కంటే ఎక్కువగా ఉంది. అది తగ్గినప్పుడు, వెండి ధరలు పెరుగుతాయి. సిల్వర్ ఇన్స్టిట్యూట్ ఇటీవల నివేదిక ప్రకారం వెండి సరఫరా తగ్గడంతో పాటు రోజు రోజుకీ వెండికి డిమాండ్ పెరుగడం కూడా ధరల పెరుగుదలకు ఒక కారణం. మరోవైపు డిమాండ్ కు తగ్గట్లుగా వెండి సప్లయి లేదు.. ఈ కారణంగా వెండి లోటులో ఉన్న ఐదవ సంవత్సరం ఇది. ఈ లోటు వెండి ధరలను మరింత పెంచింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు