ప్రపంచ కుబేరుడిగా మస్క్‌ .. 410 బిలియన్‌ డాలర్ల సంపదతో తొలి స్థానం

ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఎలాన్‌ మస్క్‌ హవా కొనసాగుతున్నది. ప్రస్తుత సంవత్సరానికిగాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో 410 బిలియన్‌ డాలర్ల సంపదతో తన తొలి స్థానాన్ని పదిలం చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడితో విభేదాలు ఏర్పడినప్పటి నుంచి ఆయన సంపద భారీగా నష్టపోయినప్పటికీ తన తొలిస్థానాన్ని దక్కించుకోవడం విశేషం. మరోవైపు, గత కొన్నేండ్లుగా వరుస స్థానాల్లో కొనసాగిన అమెజాన్‌ అధినేత బెజోస్‌, మెటా చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌లకు గట్టి షాక్‌ తగిలింది. ఒరాకిల్‌ అధినేత ల్యారీ ఎలిసన్‌ ఈసారికిగాను రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.

కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలకుమించి రాణించడంతో సంస్థ షేరు రాకెట్‌ వేగంతో దూసుకుపోయింది. దీంతో ఆయన సంపద 40 బిలియన్‌ డాలర్లు ఎగబాకి 258 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. ఒరాకిల్‌ షేరు గురువారం 13 శాతం ఎగబాకి 215 డాలర్లకు చేరుకున్నది. ఈవారంలోనే సంస్థ మార్కెట్‌ విలువ 40 బిలియన్‌ డాలర్లు ఎగబాకినట్టు అయింది. అలాగే మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌(238 బిలియన్‌ డాలర్లు), అమెజాన్‌ చైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌(228 బిలియన్‌ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు