ఇరాన్ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పెట్టుబడులకు సేఫ్ అయిన బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. దీంతో బంగారం ధర మళ్లీ లక్ష మార్కు దాటింది. రెండు నెలల క్రితం లక్ష మార్కు దాటిన పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ లక్ష దాటి పరుగులు పెడుతున్నాయి.. వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్లు పెరిగాయి. దీనికి తోడు US ట్రేడ్ పాలసీలో అనిశ్చితి, ట్రంప్ టారిఫ్స్ బెదిరింపులు, US ద్రవ్యోల్బణం,. దాంతో US బాండ్లలో కంటే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. అమెరికా అప్పులపై ఆందోళనలు, ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు వల్ల కామెక్స్‌లో గోల్డ్ ఒక్క రాత్రిలో ఔన్స్‌కు 50 డాలర్లు పెరిగింది. బంగారానికి భారీ డిమాండ్ కనిపిస్తోంది..
జూన్ 15 2025 ఆదివారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 1,01,680 ఉండగా.. 22 క్యారెట్ల ధర 93,200 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,10,000లుగా ఉంది.
ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం
ధర రూ.1,01,680 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,200 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,20,000లుగా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,680 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.93,200లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,830, 22 క్యారెట్ల ధర రూ.93,350 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,000లుగా ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,01,680, 22 క్యారెట్ల ధర రూ.93,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,01,680 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.93,200 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,680, 22 క్యారెట్ల ధర రూ.93,200 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000 లుగా ఉంది.
గమనిక, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు.. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి..