సడెన్ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

పసిడి ప్రియులకు అలర్ట్.  దాదాపు 10 రోజులుగా బంగారం ధరలు పెరగనే లేదు. మరి ఇప్పుడు మాత్రం సడెన్ షాకిచ్చింది. భారీగా పుంజుకుంది.    కొన్ని నెలలుగా బంగారం ధర ఊహించని రీతిలో పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. దాదాపు 6 నెలల కిందట కూడా 22 క్యారెట్ల పసిడి ధర తులం రూ. 70 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు రూ. 90 వేలు దాటిన సంగతి తెలిసిందే. దీంతో కొనుగోలు దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అయితే గత 10 రోజులు కిందట గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇలాగే జరిగింది. కానీ ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి గోల్డ్ రేట్లు పతనం అవుతున్నాయి. కానీ ఇవాళ మాత్రం సడెన్‌గా పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు 3300 డాలర్ల దిగువన ఉండగా.. ఇప్పుడు అది 3330 డాలర్లపైన ట్రేడవుతోంది. సిల్వర్ రేటు చూస్తే 36 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇదే సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 85.62 వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ఒక్కసారిగా భారీగా పెరిగింది. రూ. 1050 పెరగ్గా ఇప్పుడు తులం రూ. 90,200 కు చేరింది. దీనికి ముందు చూస్తే వరుసగా రూ. 150, రూ. 550, రూ. 850, రూ. 250, రూ. 1350, రూ. 50 ఇలా తగ్గుతూనే వచ్చింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1140 పెరగడంతో రూ. 98,400 కు చేరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు