మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. బఫెట్ సలహాలు ఇవే..

ట్రేడింగ్ మాంత్రికుడు వారెన్ బఫెట్ అంటే తెలియని ఇన్వెస్టర్ ఉండరనే చెప్పాలి. బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ స్థాపించి ట్రేడింగ్‌లో తనదైన ముద్ర వేశారు. తనకు తెలిసిన వ్యాపారాల్లో నేరుగా పెట్టుబడి పెట్టేందుకే ఇష్టపడతానని చాలా సార్లు చెప్పారు. తక్కువ ఖర్చు, దీర్ఘకాలిక దృష్టి, హేతుబద్ధమైన నిర్ణయాల ఆధారపడతానంటారు. వారెన్ బఫెట్ చెప్పిన పెట్టుబడి సూత్రాలు, అస్థిరమైన మార్కెట్‌ పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి బఫెట్ చెప్పిన 7 సూత్రాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తక్కువ ఖర్చును ఎంచుకోండి
తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్లను ఎంచుకోవాలని బఫెట్ చెబుతుంటారు. ఖర్చు తక్కువ ఉన్న ఎస్అండ్‌పీ 500 ఇండెక్స్ ఫండ్లు సాధారణ పెట్టుబడిదారులకు సరైన ఎంపిక అని అంటారు. నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ ఆధారంగా పని చేసే లార్జ్ క్యాప్ ఫండ్స్ తక్కువ ఖర్చుతో హైరిటర్న్స్ అందిస్తాయని సూచిస్తుంటారు.

సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
మార్కెట్ దాదాపు 10 సంవత్సరాల పాటు మూతపడినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంచగలిగే అసెట్స్ కొనాలని బఫెట్ సూచిస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లూ తరచూ ఫండ్స్ మార్చొద్దని, దీర్ఘకాలికంగా మంచి పని తీరు అందించే ఫండ్స్‌ ఎంచుకోవాలని, వాటికే సమయం ఇవ్వాలని సూచిస్తుంటారు.

భావోద్వేగ నియంత్రణ కీలకం
పెట్టుబడిలో విజయం పొందంటం తెలివితేటల కంటే మనస్తత్వంపై ఆధారపడుతుందని బఫెట్ చెబుతుంటారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు