పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. స్వల్పంగా దిగి వచ్చిన ధర తాజాగా పెరిగింది. స్టాకిస్టులు కొనుగోళ్లకు దిగడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 24 క్యారెట్ల బంగారంపై రూ.550 పెరిగి తులం రూ.99,120కి చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.500 పెరిగి తులానికి రూ.98,600కి చేరింది. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా మూడో సెషన్‌లోనూ ధర స్థిరంగా ఉన్నది. కిలోకు రూ.1,04,800 పలుకుతున్నది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 11.42 డాలర్లు పెరిగి 3,325.09 డాలర్లకు ఎగిసింది. సోమవారం నాటి పతనం నుంచి పసడి కోలుకుందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
మళ్లీ వాణిజ్య యుద్ధం మొదలవనున్నదనే భయాందోళనలు పెరిగాయి. ఆగస్టు ఒకటి నుంచి వచ్చే అములోకి వచ్చే.. జపాన్, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25శాతం సుంకం విధించాలని ట్రంప్ ఆదేశించిన నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.