1 షేరు కొంటే 1 షేరు ఉచితం.. లక్షను రూ.20 లక్షలు చేసిన స్టాక్ ఇదే..

స్మాల్ క్యాప్ కేటగిరి, హెల్త్ కేర్ రంగానికి చెందిన అబేట్ ఏఎస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (Abate AS Industries Limited) బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. తాజాగా ఈ బోనస్ షేర్లకు రికార్డు తేదీని జూలై 31గా నిర్ణయించింది. ఇంకా 3 రోజులే ఉండడంతో ఆలోపు కొనుగోలు చేసిన వారికి 1 షేరుకు మరో షేరు ఉచితంగా లభిస్తుంది. జూలై 31 రోజున ఎక్స్-బోనస్ ట్రేడింగ్ చేయనుంది. ఈ బోనస్ ఇష్యూ కంపెనీ చరిత్రలోనే తొలిసారి చేపడుతుండడం గమనార్హం. ఈ కంపెనీ స్టాక్ గత ఐదేళ్లలోనే 1,929 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. లక్ష పెట్టినట్లయితే ఆ విలువ రూ. 20 లక్షలు అవుతుంది.

కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. 1:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు బోర్డు డైరెక్టర్లు సిఫారసు చేశారు. అంటే రికార్డు డేట్ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరు తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉన్న వారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరును బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. అందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఈ బోనస్ షేర్ల జారీకి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీ జూలై 31, 2025గా బోర్డు నిర్ణయించింది.

ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 50.53, కనిష్ఠ స్థాయి రూ. 14.75 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 8 శాతం, గత నెల రోజుల్లో 96 శాతం లాభాన్ని అందించింది. అదే విధంగా గత ఆరు నెలల్లో 189 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 84 శాతం పెరిగింది. గత ఐదేళ్లలో ఈ షేర్ 1929 శాతం పెరిగింది. లక్ష రూపాయలు పెట్టి 5 సంవత్సరాలు వేచి చూసిన వారికి ఇప్పుడు వారి స్టాక్ విలువ రూ.20.29 లక్షల వరకు అవుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 398 కోట్ల వద్ద ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు