తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,800 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,330కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,950కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,480కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,02,330కు చేరింది.

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,00 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.